Header Banner

తెనాలిలో జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన! దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా...

  Tue Jun 03, 2025 13:30        Politics

గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jaganmohan Reddy) ఇవాళ(మంగళవారం) పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన కోసం స్థానిక కేడర్ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే జగన్‌కు మాత్రం నిరసనల రూపంలో ఊహించని షాక్ తగిలింది. జగన్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ దళిత, ప్రజాసంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. తెనాలి మార్కెట్‌ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి ఆందోళన చేపట్టారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన నూతక్కి కిరణ్‌ను జగన్‌ పరామర్శించలేదని... రౌడీషీటర్లకు మద్దతుగా నిలవడం దారుణమంటూ దళిత, ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. తెనాలిలో జగన్‌‌కు నిరసనల సెగ తగలడంతో వైసీపీ నేతలు డైలామాలో పడ్డారు. అలాగే ఐతానగర్‌ సెంటర్‌లో జగన్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. జగన్‌ గో బ్యాక్‌ అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. తెనాలిలో ఎర్ర బడి వద్ద జగన్ కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. దళితులపై ఇప్పుడు ప్రేమ పుట్టుకొచ్చిందా అంటూ నిరసన వ్యక్తం చేశారు. హత్యలు చేసిన వారిని, రౌడీషీట్లు ఉన్నవారిని, పోలీసులను కొట్టిన వారిని జగన్మోహన్‌రెడ్డి ఎలా పరామర్శిస్తారని ఎమ్మార్పీఎస్ నేతలు నిలదీశారు. నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. అయితే రోడ్డు మీదకు వస్తున్న దళిత సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. తెనాలిలో భారీగా పోలీసులు మోహరించారు. దీంతో తెనాలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

ఇది కూడా చదవండి: మెగా డీఎస్సీ పరీక్షల షెడ్యూల్‌లో ఈ మార్పులు గమనించారా..? వారికి నో ఛాన్స్..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

ఇంజినీరింగ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..! BEL నోటిఫికేషన్ రిలీజ్!

 

ఏపీలో 10 అద్భుతమైన బీచ్‌లు.. ఈ హిడన్ జెమ్స్ లాంటి బీచ్‌లను మిస్ అవ్వకండి..

 
ఏపీలో కొత్తగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. నేషనల్ హైవేకు కనెక్ట్! ఈ రూట్‌లోనే, డీపీఆర్ పనులు..!

 

వైసీపీకి దిమ్మ తిరిగే షాక్! టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో కీలక నిందితుడు అరెస్ట్!

 

రూ.500 కోట్ల కుంభకోణంలో కిరణ్ అరెస్ట్! దర్యాప్తులో వారి వివరాలు వెల్లడి!

 

కవిత కు కేసీఆర్ మార్క్ ట్రీట్మెంట్..! హరీష్ కు కీలక బాధ్యతలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #Guntur #Tenali #OrganizationsProtest #AgainstToJagan #TenaliPeoples